PM Kisan Mandhan Yojna Telugu, How to Apply : రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలు ఇస్తోంది. ఎక్కువమంది చిన్న, మధ్యతరహా రైతులు ఉన్నారు. కాబట్టి ఇది ఎక్కువమందికి లబ్ధి చేకూరుస్తోంది. రూ.2వేల చొప్పున మూడు పర్యాయాలు ఏడాదికి రూ.6వేలు ఇస్తోంది. అలాగే, రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన (PM-KMY) పేరుతో పెన్షన్ పథకాన్ని కూడా తీసుకు వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (పీఎం-కేఎంవై) స్కీమ్ రిజిస్ట్రేషన్స్‌ను ప్రారంభించింది. శుక్రవారం నుంచే ఈ ప్రక్రియ ఆరంభమైంది. ఈ పథకంలో నమోదు చేసుకోవడం వల్ల రైతులు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు.
PM Kisan Mandhan Yojna Telugu How to Apply (PM కిసాన్ మాన్ ధన్ యోజన)
కష్టించి పనిచేసే మన రైతులకు మరింత శక్తి…పెన్షన్ తో సురక్షితమైన భవిష్యత్.
PM కిసాన్ మాన్ ధన్ యోజన (చిన్న మరియు సన్నకారు రైతుల కోసం పెన్షన్ పథకం)
PM కిసాన్ మాన్ ధన్ యోజన వివరాలు:
యోజన ప్రారంభకులు | నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి |
ప్రారంభతేది | 12 సెప్టెంబర్, 2019 మ. 12:00 గంటలకు రాంచీ, జార్ఖండ్ నుండి |
బాధ్యత | వ్యవసాయ మరియు వ్యవసాయదారుల సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం |
కిసాన్ కాల్ సెంటర్ | 1800-180-1551 |
వెబ్ సైట్ | www.agricoop.nic.in www.farmer.gov.in |
ముఖ్యాంశాలు (Highlights)
- స్వచ్ఛంద మరియు కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం
- నెలవారీ కంట్రిబ్యూషన్ రూ.55 నుండి 200 వరకు
- కేంద్రప్రభుత్వం కూడా సమానమైన కంట్రిబ్యూషన్ ఇస్తుంది
- 60 సంవత్సరాల వయసు వచ్చిన వారికి నెలకు రూ.3000 కనీస పెన్షన్
- పెన్షన్ చెల్లింపుకు LIC బాధ్యత వహిస్తుంది
అర్హత (Eligible)
- పథకం కొరకు ప్రవేశ వయసు 18 మరియు 40 సంవత్సరాల మధ్య.
- 2 హెక్టార్ల (అయిదు ఎకరాల) వరకు వ్యవసాయ భూమి కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులు
నమోదు ప్రక్రియ (Registration process – How To Apply Online)
- కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా నోడల్ ఆఫీసర్ (PM-కిసాన్) ద్వారా ఉచిత నమోదు
- ఎన్రోలమెంట్కమ్-ఆటో డెబిట్ మ్యాండెట్ ఫారంపై లబ్దిదారు సంతకం చేయాలి
- ఆధార్ నంబరు కారు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వ్యవసాయ భూమి యాజమాన్యత డాక్యుమెంట్లు తప్పనిసరి
- PM-కిస్తాన్ మాన్ధన్ యోజన కార్లు వెంటనే జారీ చేయబడును.
మధ్యలో తప్పుకుంటే
ఈ స్కీంలో చేరాక, అరవై ఏళ్లకు ముందే మరణిస్తే ఆ సభ్యులు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా భాగస్వామికి లేదా నామినీకిగాని ఇస్తారు. సేవింగ్ బ్యాంక్ రేట్స్ వడ్డీ రేటు కట్టి ఇస్తారు. అయిదేళ్ల వరకు క్రమం తప్పకుండా చెల్లిస్తేనే, పింఛన్ పథకం నుంచి తప్పుకుంటే వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు. పెన్షన్ కావాలంటే 60 ఏళ్ల వరకు తమ వంతు వాటా చెల్లించాలి.
Leave a Reply